Graduate and Teacher MLC elections Nomination in AP : రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.