Sports Competitions for MLAs and MLCs in AP : రేపటి నుంచి జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. 173 మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్ ఆడనుండగా మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ విసరనున్నారు. మంత్రి లోకేశ్ క్రికెట్, షటిల్, వాలీబాల్‌లో పేరు ఇచ్చారు. క్రికెట్‌కు అత్యధికంగా 31 మంది బ్యాడ్మింటన్, వాలీబాల్‌కు 25 మంది చొప్పున తమ పేర్లను నమోదు చేశారు.