AP MLAs MLCs Cultural Event : విజయవాడ ఏ కన్వన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు. అనంతరం రెండ్రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు సీఎం బహుమతులను ప్రదానం చేశారు.