AP Legislature Cultural Event : నేడు రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడిన లాబీల్లో ఆప్యాయంగా పలకరించుకోవడం ఆరోగ్యకరమైన రాజకీయమన్నారు. శాసనసభ అనేది ప్రజలకు జవాబుదారీ కానీ ప్రతిపక్షానికి కాదని చెప్పారు. విజయవాడ ఏ కన్వెక్షన్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.