AP and Telangana CMs Meeting: విభజన సమస్యల కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసి మూడంచెల్లో సమస్యలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమించనున్నారు. అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు కానుంది. మంత్రుల కమిటీ సైతం పరిష్కరించలేని అంశాలపై సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు.