విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ముఖ్యమంత్రుల చర్చలు కొనసాగాయి. షెడ్యూల్ 10లోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంల భేటీ ముగిసిన తర్వాత సమావేశానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.