CM Chandrababu Review on Real Time Governance : ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరం అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించిన సీఎం, పథకాల అమలులో ఏ స్థాయిలోనూ సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదని స్పష్టం చేశారు. పింఛన్ పంపిణీని ఉదయం 5 గంటలకే మొదలుపెట్టాల్సిన అవసరం లేదన్నారు.