AP Deputy CM Pawan Kalyan on Telugu Industry Heros : సినిమా రంగంలో తనకు ఎవరితోనూ పోటీ లేదని ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ఆయన గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోకులం నిర్మాణాలు, తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్య పరిష్కరించడం, పారిశుద్ధ్య పనులు, ఇతర 30వేల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తి చేసేలా పని చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని కేకలు వేయడంతో పవన్‌కల్యాణ్ స్పందించారు.