Tammareddy On Telugu Film Industry : తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి వెళ్తుందనేది పూర్తిగా అసత్యమని, హైదరాబాద్లోనే ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, నిర్మాత, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్కు తనను పిలవకపోవడం వల్లే తాను వెళ్లలేదన్నారు. ఇండస్ట్రీకి-ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవమేనని, మొన్నటి మీటింగ్తో అది పోయిందని ఆయన చెప్పారు.