Minister Kandula Durgesh On Film Industry in Visakha And Tirupati : రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. త్వరలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖ పట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్దిపై మండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.