55 Years Celebrations NTR Cultural Association in Guntur : తెలుగు నేలకి, తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం పేరు ఎన్టీఆర్. ఈ మూడక్షరాలు చాలు తెలుగు వాడి హృదయం పొంగిపోవడానికి. ఆయన పేరిట రాష్ట్రంలో ఎన్నో అభిమాన సంఘాలు ఉండేవి. కానీ గుంటూరు జిల్లాలోని రైలుపేట సంఘం అంటే ఎన్టీఆర్‌కు అమితమైన గౌరవం. ఈ సంఘం ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి అయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో వేడుక నిర్వహించనున్నారు.