ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భారీ సంఖ్యలో అభిమానులు
  • 6 years ago
NTR Jr and Kalyan Ram made quite a sight, as they walked in hand in hand accompanied by dad Harikrishna and family members at the NTR Ghat, early on Wednesday morning to pay their respects to the late NTR, on the occasion of the matinee idols 95th birth anniversary.

దివంగత సీఎం, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు 95వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఉదయం 7గం.కి నందమూరి హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్‌ జయంతి ఒక పర్వదినం లాంటిదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఎన్ని తరాలైనా, యుగాలైనా సరిపోవని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చారని, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని హరికృష్ణ విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Recommended