Skip to playerSkip to main contentSkip to footer
  • 7/5/2018
అదరగొట్టేలా చాలా మంది హీరోలు డాన్స్ చేస్తారు. కానీ కొందరి డాన్స్ మాత్రమే ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. అలాంటి గొప్ప డాన్సర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. డాన్స్, నటన, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని అంశాల్లో ఎన్టీఆర్ అభిమానులని ఆకట్టుకుంటాడు. బుల్లితెరపై అనేక డాన్స్ షోలు వస్తున్నాయి. వాటిలో ఢీ బాగా పాపులర్ అయింది. ఢీ 10 షో ఫైనల్స్ త్వరలోనే జరగబోతున్నాయి. ఈ షోకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
అదరగొట్టే డాన్సులతో ఆడియన్స్ ని మెప్పించడానికి ఢీ 10 ఫైనల్స్ సిద్ధం అవుతోంది. అబ్బురపరిచే స్టెప్పులతోటైటిల్ సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో దుమ్ములేచిపోయే విధంగా ఉంది.
సీనియర్ హీరోయిన్ ప్రియమణి, క్రొయోగ్రాఫర్ అనీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో చూపినదాని ప్రకారం ప్రతి ఒక్కరి డాన్స్ ఆకట్టుకునే విధంగా ఉండనుంది.

NTR is chief guest for Dance showfinals. NTR gives superb entry in the show
#NTR

Recommended