Legislative Assembly Approves SC Classification Bill : ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లు ఆమోదించారు. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలున్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు.