Anitha on VR Police Issue : వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న పోలీసు సిబ్బందికి వేతనం పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ సర్కార్ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెద్దఎత్తున పోలీసులను వీఆర్లోకి పంపినట్లు చెప్పారు. వారికి అప్పటివరకు ఇస్తోన్న వేతనాలను ఇవ్వకుండా నిలిపివేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మనవతా దృక్పథంతో ఆలోచించి వారందరికీ జీతం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. పోలీసు సిబ్బందిని వీఆర్లో ఉంచడంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.