CM CHANDRABABU ON WHATSAPP GOVERNANCE: కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సప్ గవర్నెర్న్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. త్వరలోనే వాట్సప్ ద్వారా 500 వరకూ పౌరసేవలను అందించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంతో పాటు రైతు బజార్లలోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు ఆదేశించారు. బెల్టు షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దని సీఎం స్పష్టం చేశారు.