SOCIAL MEDIA POSTS CASE: సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోస్టుల వ్యవహారంలో పిటిషనర్లు హద్దులు మీరారని వ్యాఖ్యానించింది. అభిప్రాయాలు స్వేచ్ఛగా చెబుతున్నామంటూ వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పోస్టుల్ని నివారించేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని పోలీసులను ఆదేశించింది.