High Court Supports Cases Against Objectionable Social Media Posts : సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టుల పెడుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఎంత మాత్రం తగిన వేదిక కాదంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా అసభ్యకర పోస్టులు పెడుతూ ఏమైనా చేయవచ్చు అనుకునే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది.