Three Additional Judges Swearing Ceremony In AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు, పలువులు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.