A Team of judges will go to Kurnool Due to High Court Bench : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంచ్‌కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వెళ్లనుంది. దిన్నెదేవరపాడు వద్ద విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని వారు పరిశీలించనున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ తెలిపారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.