Konatham Dileep Arrested : డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థచేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేక అరెస్టు చేశారని ఆయన దుయ్యబట్టారు.