High Court Verdict On Dilsukhnagar Bomb Blasts : హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2013లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. 2013లో జరిగిన పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ కోర్టు ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించగా ఆ తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది.