ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు..!
  • 6 years ago
వివాహేతర సంబంధం నేరం కాదని... దానిపై ఉన్న చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని చెబుతూ కొట్టివేసింది. వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగికంగా కలిస్తే అది నేరం కాదని న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరి ఏకాభిప్రాయంతోనే ఆ కార్యం జరుగుతుందని పేర్కొంది. ఒక పురుషుడు శృంగారం కోసం ప్రేరేపించడం మహిళ బాధితురాలుగా ఉండటం అనేది జరగదని... పురుషుడు స్త్రీ కలిసి శృంగారంలో పాల్గొంటారు కాబట్టి ఇద్దరిది సమాన బాధ్యత ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. వివాహం తర్వాత స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యభిచారంపై ఉన్న చట్టం భార్య భర్త సొత్తు అని చెప్పేలా ఉందని... అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
#SupremeCourt
#justicedipakmisra
#marriage
#section497
Recommended