MP Mithun Reddy Liquor Case On Supreme Court : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2019-24 మధ్య ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సహా కొందరు నాయకులు ముడుపులుగా దండుకున్నట్లు స్పష్టం చేసింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది.