SIT OFFICIALS QUESTIONED MP MITHUN REDDY: మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు వైసీపీ నేతలు వరుస కడుతున్నారు. తొలిరోజు విజయసాయిరెడ్డిని విచారించిన అధికారులు ఎంపీ మిథున్‌రెడ్డిపై శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలను సంధించారు. విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ మద్యంతో తనకేంటి సంబంధమని ఎంపీ బుకాయించారు. ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌పై సమాధానాలివ్వకుండా దాటవేశారు. ఆధారాలు చూపించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా మిథున్‌రెడ్డి నీళ్లు నమిలారు.