KTR Comments On Caste Census In Telangana : కులగణన పూర్తిగా తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారన్న కేటీఆర్ దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చిత్రీకరించారని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. దీనిపై బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణన చిత్తు కాగితంలో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారని కేటీఆర్ తెలిపారు.