Congress Leaders Comments On KCR : 4 నెలలుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ అకస్మాత్తుగా ప్రేమ ప్రదర్శించడం దేనికి సంకేతమని రాష్ట్ర కాంగ్రెస్ ప్రశ్నించింది. స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసమే బీఆర్ఎస్ అధినేత మరోమారు బయటకొచ్చి కట్టు కథలు చెబుతున్నారని విమర్శించింది. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో అర్థం లేదని మండిపడింది. ముందు బీఆర్ఎస్ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలంటూ హితవు పలికారు.