Comprehensive Caste Census : కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడురోజులపాటు ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో చేపట్టారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈసర్వే మెగా హెల్త్ చెకప్లా ఉపయోగ పడుతుందన్నారు.