CM Revanth Reddy On Caste Census Survey in India : కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని, ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కులగణన సమాజానికి ఎక్స్రే లాంటిదని రాహుల్ అన్నారని గుర్తు చేశారు.అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీ పంపాలని, కులగణనలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని, కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్ర అనుభవం వినియోగించుకోవాలని తెలిపారు.