CM Revanth Reddy On Group 1 Candidates : గ్రూప్ వన్ విషయంలో అపోహలు నమ్మవద్దని పదేళ్లలో కనీసం పట్టించుకోని వారి ఉచ్చులో పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటుందని వారు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరువేసుకోవాలని సీఎం సూచించారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దయచేసి ఆందోళన విరమించి మెయిన్ పరీక్షకు హాజరుకావాలని లేదంటే బంగారు అవకాశాన్ని కోల్పోతారని సూచించారు.