CM Revanth On NSS Volunteers : డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించామని ఈ సమరంలో ఎన్ఎస్ఎస్ కూడా కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జేఎన్టీయూలో 'డ్రగ్స్ నియంత్రణ-మహిళ భద్రతలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.