People Boycotted Caste Census In Kamareddy District : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణనను 17 తండాల ప్రజలు బహిష్కరించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని 17 తండాల్లో కులగణన సర్వేకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన సర్వేలో లభాన జాతి లంబాడీలకు ఆప్షన్ ఇవ్వనందున తాము బహిష్కరిస్తున్నట్టుగా తెలిపారు.