Farmers Lost Their Lands in Kakinada SEZ : కాకినాడ సెజ్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్లుగా కకావికలమయ్యాయి. ఆశలు రేపిన 2021 నాటి జీవో-12 ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది రైతులు ఇప్పటికీ అధికార యంత్రాంగం, సెజ్ యాజమాన్యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన వాళ్ల కోసం రైతుల పొట్టగొట్టిన గత జగన్ సర్కార్, వారి ఉపాధి అవకాశాలకూ గండి కొట్టింది.