YSRCP Leaders Assigned Lands Grabbed: పేదలు, పెత్తందారులు అంటూ పదేపదే మాటలు చెప్పిన వైఎస్సార్సీపీ పెద్దలు దాదాపు 40 వేల ఎకరాల పేదలకు ఇచ్చిన భూముల్ని కొట్టేశారు. పేదలకు అసైన్ చేసిన భూములను కారుచౌకగా రాయించేసుకున్నారు. ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో వైకాపా పెత్తందారులు, కొందరు సీనియర్ అధికారులకు లబ్ధి కలిగినట్లుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఇచ్చిన నివేదికలోని అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి.