Door-To-Door Survey Revealed That 1.5 Crore Unemployed People in the State : పనిచేసే వయసులో పనిలేని వాళ్లు రాష్ట్రంలో కోటిన్నర మంది ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో వెల్లడైంది. సచివాలయాల ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు. ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తేల్చారు. వీరందరికీ ఆసక్తి గల రంగంలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తగిన విద్యార్హతలున్న వారికి ఇళ్ల నుంచే పని చేసుకునేలా వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.