రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఈ ఏడాదికి ఘనంగా ముగింపు పలికేందుకు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్లు, పబ్లు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పలు నిబంధనలు జారీ చేశారు.