Nampally Numaish Exhibition 2025 : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరస సెలవులు రావడంతో రోజుకు 60వేల మంది వరకు సందర్శకులు వస్తున్నారు. నచ్చిన వస్తువులు గృహోపకరణాలు, దుస్తులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు సహా బాంబు స్వాడ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.