విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 5 సంవత్సరాల్లో 719 గంజాయి కేసులు నమోదైనట్లు నగర సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. వీటిలో మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేసినట్లు లేదన్నారు. మరోవైపు దీని రవాణా ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాలోని సీలేరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తామని సీపీ స్పష్టం చేశారు.