పార్వతీపురం జిల్లా సాలూరు మండలం పసుపువానివలస సమీపంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు ఓ రైతుకు చెందిన 7 ఎకరాల అరటి తోట ధ్వంసమైంది. సుమారు 9 లక్షల రూపాయలు నష్టం వచ్చిందని రైతు తెలిపాడు. మరో 2 నెలల్లో పంట చేతికి వస్తుందనగా ఈదురుగాలి వచ్చి మొత్తం నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతు విజ్ఞప్తి చేశారు.