Mahashivratri Celebrations 2025 : తలచినంతనే వశమయ్యే భక్తవత్సలుడు అడిగినంతలో కరుణించే దయామయుడు నిర్గుణుడు నిర్వికారుడు. ఆర్తజనరక్షకుడు అసురులకూ వరాలిచ్చే భోళాశంకరుడు. సత్యస్వరూపుడు ఆనందతాండవుడు ఆలిని తనలో ఇముడ్చుకున్న అర్ధనారీశ్వరుడు. మనిషిలోని శక్తిని ఉప్పొంగించి ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చే పర్వదినమే మహా శివరాత్రి. ఈ విశిష్ట రోజున పరమశివుడిని పూజిస్తే కుటుంబం చల్లగా ఉంటుందని భక్తజనం నమ్ముతారు. ఈ పర్వదినం ఉపవాస, జాగరణలే కాదు మరెన్నో ఆధ్యాత్మిక, జీవన సందేశాలున్న సుదినం. ఆది అంతం లేని లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుడిని బ్రహ్మా, మురారి, సురులు అర్చించిన రోజు.