Karthika Masam 2024 : కార్తిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అత్యంత పవిత్రమైన కార్తిక మాసం శనివారం నాడు ప్రారంభమైంది. ఇది నవంబర్ 30న ముగుస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కార్తిక శోభ వెల్లివిరిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాతున్నాయి. శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలంకరణ చేయడం దేవాలయ ప్రాంగణాలు కాంతులతో వెల్లువిరిశాయి. ఉపవాస దీక్షలు, అభిషేకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.