Grape Festival In Hyderabad 2025 : ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ద్రాక్ష మేళా వచ్చేసింది. రైతుల్లో సాగు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. పది రోజులపాటు జరగనున్న ద్రాక్ష మేళాకు ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలి వస్తోన్నారు. ప్రశాంత వాతావరణంలో తోట అందాలు తిలకిస్తూ స్వయంగా రకరకాల ద్రాక్ష పండ్లు కోసి రుచి చూస్తూ కొనుగోలు చేస్తున్నారు.