Motla Thanda Grama Panchayath : మీరు దీనిని చూసి పాన్ డబ్బానో, చిన్న కిరాణా షాపో అనుకునేరు. మీరు అనుకున్నట్లు కాదు ఇది. పైన చిత్రంలో కనిపిస్తున్న రేకుల డబ్బా ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇదే వాస్తవం. ఇది మహబూబాబాద్ జిల్లాకు చెందిన మొట్ల తండాలో ఉంది. 2018లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈ మొట్ల తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది.