Sadar Festival Celebrations In Hyderabad : ప్రతీ సంవత్సరం దీపావళికి యాదవులు సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిపే ఆ వేడుకల్లో అలరించేందుకు భారీ దున్నరాజులు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి తీసుకొచ్చిన ఘోలు-2 ఛాంపియన్ బుల్‌తో శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలు ఈ సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్నాయి.