Chintan Shivir 2025 in Dehradun : ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ చింతన శివిర్ ఇవాళ ప్రారంభమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై రెండు రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు.