Minister Sethakka Allegations On Talasani Family : దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్, కేటీఆరే ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. అనుమతులిచ్చే సమయానికి ఇథనాల్ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి ఉన్నారన్న ఆమె ఆ కంపెనీ మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారన్నారు. పుట్టా సుధాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులని సీతక్క వెల్లడించారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులిచ్చారన్న మంత్రి బీఆర్ఎస్ నాయకులు తప్పు చేసి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ దిలావర్‌పూర్ రావాలన్న సీతక్క కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారనేది అక్కడే తేలుస్తామన్నారు.