Pawan kalyan Comments On Swarnandhra Vision 2047 Document : స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలన్నారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయని తెలిపారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవని స్పష్టం చేశారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుషుతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. ప్రజల మంచికోరే చంద్రబాబు గౌరవం తాను ఏ రోజూ తగ్గించనని పేర్కొన్నారు.