Viral Fever Cases Increasing Day by Day In AP : రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది.