Vigilance Inquiry on Illegal Sand : వైఎస్సార్సీపీ పాలనలో సాగిన ఇసుక దోపిడీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా నాడు గనులశాఖ పట్టించుకోలేదు. గనులశాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకుని దోపిడీకి పాల్పడిన తీరుపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు, గతంలో ఫిర్యాదు చేసినవారిని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.