Raj Kasireddy Illegal Sand Mining : వైఎస్సార్సీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారుడైన రాజ్ కసిరెడ్డి జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుకపైనా పెత్తనం చెలాయించారు. ఎక్కువ వాటాలిస్తానని ఆ పార్టీ ముఖ్యనేతకు నచ్చజెప్పి ఇసుక సిండికేట్ల ముఠా నాయకుడిలా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో చివరి 15 నెలల పాటు ఇసుక వ్యాపారంలో నెలకు రూ.180 కోట్ల చొప్పున వసూలయ్యేలా చేశారు. ఈ దందాకు అప్పటి ఓ మంత్రి కుమారుడు అండగా నిలిచారు.